దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు
NEWS Mar 16,2025 02:15 pm
తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నేడుములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ పైడాకుల అశోక్ మాట్లాడుతూ స్పీకర్ దళితుడనే భావంతో జగదీష్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.