ఆస్పత్రి పాలైన మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్
NEWS Mar 16,2025 11:03 am
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆస్పత్రి పాలయ్యారు. ఆదివారం ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన చెన్నై లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అల్లా రఖా రెహమాన్ కు ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆస్పత్రి పాలైనట్లు తెలిసిన వెంటనే చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.