ముంబై ఇండియన్స్ స్కిప్పర్ గా సూర్య
NEWS Mar 16,2025 10:53 am
ముంబై ఇండియన్స్ స్కిప్పర్ గా సూర్య కుమార్ యాదవ్ ను నియమించింది యాజమాన్యం. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. 23న చెన్నై సూపర్ కింగ్స్ తో తొలి మ్యాచ్ ఆడనుంది ముంబై ఇండియన్స్. రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనివార్య కారణాలతో తప్పు కోవడంతో తన స్థానంలో సూర్య భాయ్ ను నియమించినట్లు తెలిపింది . అతడిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధించింది. ఇక సూర్య కుమార్ యాదవ్ టీ20 భారత జట్టుకు స్కిప్పర్ గా వ్యవహరించాడు. రోహిత్ శర్మ కేవలం ఆటగాడిగా మాత్రమే ఉండనున్నాడు.