సీఎంకు జీయర్ స్వాముల ఆశీర్వాదం
NEWS Mar 16,2025 09:35 am
అమరావతిలోని వెంకట పాలెంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభోపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా వివిధ పీఠాధిపతుల నుండి ఆశీస్సులు అందుకున్నారు.శ్రీనివాస కల్యాణం ఘనంగా పూర్తయిన తర్వాత తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, అహోబిలం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివస్వామి, శ్రీ కమలానంద స్వామి, ఇతర పీఠాధిపతుల నుండి ఆశీస్సులు పొందారు.