గంజాయి విక్రేతల అరెస్ట్
NEWS Mar 15,2025 08:34 pm
మెట్ పల్లి పట్టణంలోని శాంతినగర్ కాలనీలో గంజాయి త్రాగుతున్న రూపేష్ కుమార్, సునీల్ కుమార్, సంతోష్ కుమార్, చోటు కుమార్ లను అరెస్ట్ చేసినట్టు సీఐ నిరంజన్ రెడ్డి , ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. బీహార్ కు చెందిన వీరు గంజాయి కి బానిస కావడమే కాకుండా, బీహార్ నుండి గంజాయి తీసుకువచ్చి మెట్ పల్లి, మల్లాపూర్, పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని చెప్పారు. 450 గ్రాముల గంజాయి, అశోక్ లీలాండ్ వాహనాన్ని సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.