స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయాలి
NEWS Mar 15,2025 05:40 pm
విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో ఒరిగింది ఏమీ లేదన్నారు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు. కేంద్రం ప్రకటించిన రూ.11వేల కోట్లు ప్యాకేజి ని చూసి తొలుత ప్లాంట్ ను నిలబెట్టడానికి అనుకున్నామని అన్నారు. ఇది తమ ఘనత అంటూ సీఎం చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. తీరా చూస్తే ప్లాంట్ ను రక్షించడానికి ఉద్యోగుల కోసమో కాకుండా బ్యాంకుల అప్పుల కోసం మాత్రమే అని అర్ధం అవుతుందని అన్నారు. ప్లాంట్ నిలదొక్కుకోవాలంటే సొంత గనులివ్వాలని, సెయిల్ లో విలీనం చేయాలన్నారు.