విద్యార్థులకు చట్టాలపై అవగాహన
NEWS Mar 15,2025 05:50 pm
జహీరాబాద్ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో ఝరాసంగం మండల కేంద్రంలో గల ZPHS పాఠశాలలో, కస్తూర్భా బాలికల విద్యాలయంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును సీనియర్ సివిల్ జడ్జి సూరి కృష్ణ నిర్వహించారు. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించి, సూచనలు చేశారు. న్యాయమూర్తి, న్యాయవాదులు మాట్లాడుతూ ప్రతీ విద్యార్ధి చదువుతో పాటు సాధారణ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.