ప్రజల తరపున ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తట్టుకోలేక పోతోందని అన్నారు జహీరాబాద్ మండల మాజీ సీసీడీఎస్ చైర్మన్ వై. నరోత్తం. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను దూషించక పోయినా అగౌరవ పరిచారంటూ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీకి రాకుండా చేయడం దారుణమన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో దారుణంగా విఫలం అయ్యారని, వాటిని కప్పి పుచ్చుకునేందుకే ఇలాంటి చర్యలు చేపట్టారని ధ్వజమెత్తారు.