కేసీఆర్ కుటుంబం నుంచే ప్రాణ హాని
NEWS Mar 15,2025 02:02 pm
అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. తను వందేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. కేసీఆర్ ప్రతిపక్షంలో ఉండి తమకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆశిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో ఏమీ లేదన్నారు. ఉన్నదంతా బీఆర్ఎస్ హయాంలోనే ఎత్తుకు వెళ్లారని, లంకె బిందలు ఉన్నాయని అనుకుంటే ఏ ఒక్కటి దొరకడం లేదన్నారు. ఇక కేసీఆర్ వద్ద ఏముందని తీసుకోవడానికి అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యుల వల్లనే కేసీఆర్ కు ప్రాణ హాని ఉందని, అందుకే సెక్యూరిటీ పెట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.