హోంగార్డులకు జీతాలు పెంచండి
NEWS Mar 15,2025 01:42 pm
ఏపీలో పని చేస్తున్న హోంగార్డులకు వేతనాలు పెంచాలని కోరారు సీపీఐ నేత రామకృష్ణ. ఈ మేరకు శనివారం ఆయన హోం మంత్రి వంగలపూడి అనితకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో రూ. 25 వేల చొప్పున హోంగార్డులకు ఇస్తున్నారని తెలిపారు. అంతే కాకుండా హోంగార్డు కుటుంబ సభ్యులకు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని కోరారు. పోలీస్ నియామకాలలో నిబంధనలు సడలించాలని, కోటాను పెంచాలని డిమాండ్ చేశారు. లేక పోతే ఆందోళన చేపడతామని రామకృష్ణ హెచ్చరించారు.