బీఆర్ఎస్వీ నాయకులపై ఫిర్యాదు
NEWS Mar 15,2025 01:46 pm
సీఎం రేవంత్ రెడ్డిని కించపరుస్తున్న బీఆర్ఎస్వీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్ఎస్ యుఐ నాయకులు మెట్పల్లి ఎస్ఐ కిరణ్ కుమర్ కు ఫిర్యాదు చేశారు. సీఎం చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేక కొందరు BRSV నాయకులు కక్ష పూరితంగా ప్రభుత్వాన్ని కించ పరుస్తూ సోషల్ మీడియాలో నిరాధారమైన పోస్టులు షేర్ చేస్తున్నారని ఆరోపించారు. వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు నేతలు బీర్కుల విజయ్, శివ, సమీర్, ఖాజా అజీమ్, సాయికుమార్.