లాకప్ డెత్ కలకలం
NEWS Mar 15,2025 11:33 am
నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఓ నిందితుడు రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వివాదంగా మారింది. పోలీసులు కొట్టడంవల్లే నిందితుడు చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు ప్రభుత్వ జిల్లా దవాఖాన ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా అంతర్గాంకు చెందిన సంపత్ (32) జగిత్యాల జిల్లాలో మ్యాన్‌పవర్ కన్సల్టెన్సీ ద్వారా నిరుద్యోగులను థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ తదితర దేశాలకు పంపిచాడు.