హిందీని వద్దంటే ద్వేషించడం కాదు
NEWS Mar 15,2025 09:42 am
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నిప్పులు చెరిగారు. ఆయన ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఏకి పారేశారు. శనివారం ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. బహు భాషలు రావాల్సిన అవసరం ఉందంటూ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పవన్ పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. హిందీ భాషను వద్దంటే దానిని ద్వేషించడం ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. ఎవరికైనా , ఏ ప్రాంతానికైనా ముందు మాతృ భాష ముఖ్యమని స్పష్టం చేశారు ప్రకాశ్ రాజ్. తాను చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. స్వాభిమానంతో మాతృ భాషను కాపాడుకోవడం, తమ తల్లిని రక్షించు కోవడం అని పేర్కొన్నారు.