తిరుమల క్షేత్రం భక్త సందోహం
NEWS Mar 15,2025 08:30 am
తిరుమల పుణ్య క్షేత్రం కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను 63 వేల 987 మంది భక్తులు దర్శించుకున్నారు. 26 వేల 880 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.88 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం దర్శనం కోసం డైరెక్టు లైన్ కొనసాగుతోందని, ఎలాంటి టోకెన్లు లేని సర్వ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు ఈవో.