బంగ్లా క్రికెటర్ మహమ్మదుల్లా గుడ్ బై
NEWS Mar 15,2025 08:06 am
బంగ్లాదేశ్ క్రికెట్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆ దేశానికి చెందిన స్టార్ క్రికెటర్ మహ్మదుల్లా తాను క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. దీంతో మహ్మదుల్లా అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. తను క్రికెటర్ గా ఎన్నో సేవలు అందించాడు. మరెన్నో విజయవంతమైన మ్యాచ్ లలో కీలక పాత్ర పోషించాడు. 39 ఏళ్ల వయసు కలిగిన మహ్మదుల్లా 2021లో టెస్ట్ ఫార్మాట్ కు , 2024లో టి20 లకు గుడ్ బై చెప్పాడు. బంగ్లాదేశ్ జట్టు తరపున 50 టెస్టులు, 239 వన్డేలు, 141 టీ20 మ్యాచ్ లు ఆడాడు. అన్ని ఫార్మాట్ లలో కలిపి 11 వేల 47 రన్స్ చేశాడు.