మెట్‌పల్లి PSలో హోలీ సంబరాలు
NEWS Mar 14,2025 11:27 pm
హోలీ పండగ సందర్బంగా మెట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో అధికారులు, సిబ్బంది ఒకరిపై ఒకరు రంగులు వేసుకుని సంబురాలు జరుపుకున్నారు. హోలీ వేడుకలను సాంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు. సీఐ కార్యాలయం వద్ద పోలీస్ సిబ్బంది సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్సై కిరణ్ కుమార్ లకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.