సీఎం రేసులో లేనన్న ఉత్తమ్
NEWS Mar 14,2025 06:43 pm
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలంగాణ ముఖ్యమంత్రి రేసులో లేనని స్పష్టం చేశారు. గత కొంత కాలంగా రాష్ట్ర సీఎంను మారుస్తున్నారని వస్తున్న ప్రచారంపై స్పందించారు. రేవంత్ రెడ్డి బీజేపీ టచ్ లోకి వెళ్లారంటూ, దీంతో హైకమాండ్ తనను పట్టించు కోవడం లేదని, రాహుల్ కు స్నేహితుడైన ఉత్తమ్ ను సీఎం చేస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం లేదన్నారు.