సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో హోలీ, రంజాన్ పండగల సందర్బంగా స్థానిక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్త్ ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చేసిన ఏర్పాట్లలో భాగంగా పట్టణంలోని ప్రధాన కూడలీలను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, డీఎస్పీ సత్తయ్య గౌడ్ పరిశీలించారు.