మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నమ్మించి మోసం చేయడం మాజీ సీఎం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. వైసీపీ అనేది పార్టీ కాదని అదో చిల్లర మల్లర రాజకీయాలు చేసే ఓ చిల్లర గుంపు అంటూ ఆరోపించారు. తనను నిట్టనిలువునా మోసం చేశాడని వాపోయారు. వర్గీకరణపై వైసీపీ గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. వర్గీకరణపై స్పష్టమైన వైఖరి ఏమిటో ప్రకటించాలన్నారు. తెలంగాణ మాదిరిగా ఏపీలో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు డొక్కా మాణిక్య వర ప్రసాద్.