సీఎంను కలిసిన టీటీడీ చైర్మన్..ఈవో
NEWS Mar 14,2025 04:34 pm
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సీఎం చంద్రబాబును కలిశారు. మార్చి 15న శనివారం అమరావతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం జరగనుంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది టీటీడీ. బీఆర్ నాయుడుతో పాటు ఈవో జె. శ్యామల రావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఉండవల్లిలో సీఎం నివాసంలో కలుసుకున్నారు. వెంకటపాలంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే శ్రీనివాస కళ్యాణోత్సవానికి సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు అందజేశారు.