కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలి
NEWS Mar 14,2025 02:19 pm
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దళిత అధికారి, దళిత జడ్జి, గిరిజన పోలీసు, బీసీ మంత్రి, మహిళా ఇన్స్పెక్టర్ ఇవన్నీ ఆ వ్యక్తుల మనోభావాలను గాయపరుస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థాయికి చేరుకొని ఉంటారని, ఆ పోజిషన్ లోకి రావడం వాళ్ల హక్కు అన్నారు. స్పీకర్‌కు సామాజిక గుర్తింపు అంటగట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరారు. అకారణంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు ఆర్ఎస్పీ.