టీటీడీపై ఎంపీ రఘునందన్ ఫైర్
NEWS Mar 14,2025 12:43 pm
టీటీడీ పాలక మండలి అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టంచు కోవడం లేదంటూ ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో 294 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖలను తీసుకునేదని కానీ ఇప్పుడు ఆ సీన్ లేదన్నారు. కేవలం ఏపీకి చెందిన వారికే ప్రయారిటీ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు. దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలన్నారు రఘునందన్ రావు.