ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్
NEWS Mar 14,2025 10:35 am
ఈ ఏడాది జరిగే టాటా ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అక్షర్ పటేల్ కెప్టెన్ గా ఉంటాడని ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్ మెంట్ సంచలన ప్రకటన చేసింది. గతంలో ఈ జట్టుకు స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ స్కిప్పర్ గా వ్యవహరించాడు. పటేల్ ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందాడు. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో సత్తా చాటాడు. తాజాగా దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో కీలకమైన పాత్ర పోషించాడు అక్షర్ పటేల్. దీంతో తమ జట్టుకు తనే బెస్ట్ ఛాయిస్ అంటూ స్పష్టం చేసింది ఢిల్లీ మేనేజ్మెంట్. కాగా ఈ ఏడాది జరిగిన వేలం పాటలో రిషబ్ పంత్ ను భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసింది.