విజయసాయి రెడ్డి కామెంట్స్ అంబటి ఫైర్
NEWS Mar 14,2025 09:51 am
మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లనే తాను పార్టీకి దూరమయ్యానంటూ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పార్టీలోనే విజయ సాయి రెడ్డే అసలైన కోటరీగా ఉంటూ వచ్చారని, ఆయనకు జగన్ ఇచ్చినంత ప్రయారిటీ ఎవ్వరికీ ఇవ్వలేదన్నారు. ఆ విషయం తనకే కాదు పార్టీలోని వారందరికీ , ప్రజలకు కూడా తెలుసన్నారు. విజయ సాయి రెడ్డి పోతూ పోతూ ఇలా అభాండాలు వేయడం దారుణమన్నారు. ఎవరి ప్రలోభాలకు లోనయ్యారో తను ఇలా మాట్లాడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.