శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లు
NEWS Mar 14,2025 09:29 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి , శ్రీ అలివేలు మంగమ్మలను 51 వేల 148 మంది భక్తులు దర్శించుకున్నారు. 21 వేల 236 మంది తల నీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు ఈవో జె. శ్యామల రావు. శ్రీవారి దర్శనం కోసం ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 18 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.