బలవంతంగా రంగులు వేస్తే చర్యలు తప్పవు
NEWS Mar 14,2025 04:41 pm
హోలీ పండుగను ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా జరుపుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. బలవంతంగా రంగులు వేసే ప్రయత్నం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పండుగను అందరూ కలిసి మెలిసి ఆనందంగా జరుపుకోవాలని సూచించారు .పరిచయం లేని వ్యక్తులు, సంబంధం లేని వారి వద్దకు వెళ్లి , వారికి ఇష్టం లేకున్నా బలవంతంగా రంగులు వేయొద్దన్నారు.