క్యాంప్ గడి పాఠశాలలో హోలీ సంబరాలు
NEWS Mar 13,2025 07:29 pm
కోరుట్ల: ప్రాథమిక పాఠశాల SRSP క్యాంప్ గడి పాఠశాలలో హొలీ పండుగను విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయులు జరుపుకున్నారు. ప్రకృతి సిద్దమైన పువ్వుల రంగులు పూసుకొని ఆట పాటలతో సంబరాలు చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు నునావత్ రాజు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకలో ఉపాధ్యాయులు పూర్ణ చందర్, సురేందర్,సురేఖ, ధన లక్ష్మి, సుమలత విద్యార్థులు పాల్గొన్నారు.