విద్యా రంగానికి నిధులు కేటాయించాలి
NEWS Mar 13,2025 06:39 pm
రాష్ట్ర బడ్జెట్ లో విద్యా రంగానికి అత్యధికంగా నిధులు కేటాయించాలని కోరారు జగిత్యాల ఏబీవీపీ నాయకులు. కలెక్టరేట్ లో 15 శాతం నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు. పెండింగ్ లో ఉన్న ఫీ రీయింబర్స్ మెంట్ , ఉపకార వేతనాల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. అంతే కాకుండా ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలన్నారు. విశ్వ విద్యాలయాల అభివృద్దికి గాను గ్రాంటును మంజూరు చేయాలని విన్నవించారు.