రేషన్ కార్డులపై మాట్లాడే అర్హత లేదు
NEWS Mar 13,2025 04:23 pm
మాజీ మంత్రి కొండా సురేఖ నిప్పులు చెరిగారు. జీవన్ రెడ్డి సబ్జెక్టుపై మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతలు అడ్డు తగలడం దారుణమన్నారు. రేషన్ కార్డుల గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేక పోవడం చూసి సిగ్గు పడాలన్నారు. తాము వచ్చాక సీన్ మారిందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఇస్తున్నామని చెప్పారు మంత్రి. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు దక్కుతుందన్నారు.