రూ. 45 లక్షల ఎర్ర చందనం స్వాధీనం
NEWS Mar 13,2025 03:32 pm
తిరుపతి జిల్లా పుత్తూరు అటవీ ప్రాంతంలో అక్రమ రవాణా చేస్తున్న 112 ఎర్రచందనం దుంగలతో పాటు, రవాణాకు ఉపయోగించిన కారును ఎర్రచందనం టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ అదేశాల మేరకు డీఎస్పీ (ఆపరేషన్స్) శ్రీ జి. బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో దాడులు చేపట్టారు. తిరుమలకుప్పం మెయిన్ రోడ్డు లోని రామ సముద్రం గ్రామం వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ రూ. 45 లక్షలు ఉంటుందని తెలిపారు.