ఎస్ఐపై దాడి పట్ల మంత్రి సీరియస్
NEWS Mar 13,2025 03:06 pm
విజయనగరం జిల్లాలో మహిళా ఎస్సై పట్ల ఆకతాయిలు దాడి చేసిన ఘటనపై తీవ్రంగా స్పందించారు మంత్రి అనిత వంగలపూడి. మద్యం మత్తులో హద్దులు మీరి ప్రవర్తించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. వేపాడ మండలం గుడివాడ గ్రామంలో డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమంలో నృత్యం చేస్తున్న మహిళలపై తాగుబోతులు రెచ్చి పోయారు. అడ్డుకోబోయిన మహిళా ఎస్సై పైనా దురుసుగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీతో వకుల్ జిందాల్‌తో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
జాతర పేరుతో మహిళల పట్ల పోకిరీ వేషాలు వేస్తే సహించబోమని హెచ్చరించారు.