రుణ మాఫీ కాదు వడ్డీ మాఫీ పథకం
NEWS Mar 13,2025 02:12 pm
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ పై మండిపడ్డారు. గత 10 ఏళ్ల పాలన కాలంలో ఏం చేశారో చెప్పాలని అన్నారు. ప్రజలను మోసం చేయడం తప్పా చేసింది ఏమీ లేదన్నారు. తమ ఆస్తులను పెంచుకున్నారే తప్పా చేసింది ఏముందంటూ ప్రశ్నించారు. ఇవాళ ఖజానా ఖాళీ అయ్యిందన్నారు. రుణ మాఫీ కాదని వడ్డీ మాఫీ పథకం మాత్రమే చేశారంటూ ఎద్దేవా చేశారు. దేశంలో రుణ మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం తమ ప్రభుత్వం అంటూ స్పష్టం చేశారు. ఇకనైనా అబద్దాలు చెప్పడం మాను కోవాలని హితవు పలికారు.