కాంగ్రెస్ లేక పోతే తెలంగాణ లేదు
NEWS Mar 13,2025 02:08 pm
కాంగ్రెస్ పార్టీ దయ వల్లనే తెలంగాణ వచ్చిందన్నారు ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశం. అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చింది కూడా తమ పార్టీనేనని పేర్కొన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమానికి జీవం పోశారని గుర్తు చేశారు.పొన్నం ప్రభాకర్, వివేక్, రాజగోపాల్ లాంటి పెద్దలు పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడారని కొనియాడారు. సోయి లేకుండా మాట్లాడటం అలవాటుగా మారిందంటూ బీఆర్ఎస్ నేతలపై భగ్గుమన్నారు వేముల వీరేశం.