మాజీ మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు షాక్
NEWS Mar 13,2025 01:57 pm
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి కోలుకోలేని షాక్ తగిలింది. బుగ్గ మఠం భూములపై కీలక తీర్పు ఇచ్చింది హైకోర్టు. బుగ్గమఠం భూములు ఆక్రమించి పార్టీ కార్యాలయం, గోశాల నిర్మించారని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఏపీ విజిలెన్స్. ఇందుకు సంబంధించి నోటీసులు జారీ చేసింది ఎండోమెంట్ శాఖ. దీనిపై పెద్దిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. నోటీసులు నిలుపుదల చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు. యాజమాన్య హక్కుల విషయంలో పత్రాలు లేనందున స్టే ఇవ్వలేమంటూ తేల్చి చెప్పింది.