పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు
NEWS Mar 13,2025 01:44 pm
సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ముందు నుంచి పని చేసిన వారికి కీలకమైన పదవులు ఇవ్వడం జరిగిందన్నారు. కొందరు తన గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు రాని వారికి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తానని హామీ ఇచ్చామని, అవన్నీ ఇప్పుడు అమలు చేస్తున్నామని చెప్పారు. పార్టీ అనుబంధ విభాగాల్లో పని చేసినవారికి ఒకేసారి 37 కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చామని తెలిపారు. అందులో భాగంగానే అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్‌లకు ఎమ్మెల్సీలు ఇచ్చామని అన్నారు.