అసెంబ్లీలో నిప్పులు చెరిగారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్ పై భగ్గుమన్నారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసింది మీరు కాదా అంటూ మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి పదేళ్ల పాటు రాచరిక పాలన సాగించింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. మీకు ఒక్క మాట కూడా తమ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పి మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. అబద్దాలు చెప్పి రెండోసారి అధికారంలోకి వచ్చారని, చివరకు మీరు చెప్పినవన్నీ చేయరని భావించే తమకు ప్రజలకు బ్రహ్మరథం పట్టారని చెప్పారు. ఇకనైనా బుద్దిగా ఉండాలని సూచించారు.