పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ నోటిఫికేషన్ రిలీజ్
NEWS Mar 13,2025 10:51 am
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాలిటెక్నిక్ లో వివిధ కోర్సులలో చేరేందుకు గాను పోలీసెట్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆన్ లైన్ లో దరఖాస్తులను చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 12 నుంచి ప్రారంభమైందని తెలిపింది. వచ్చే నెల ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాలకు గాను https://polycetap.nic.in/ ఈ వెబ్ సైట్ ను ఉపయోగించు కోవాలని సూచించింది. ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే హెల్ప్ డెస్క్ నంబర్స్ 7901620551/ 7901620557 / 7901620567 లో ల్యాండ్‌లైన్ 08645293151 లో సంప్రదించాలని కోరింది. ఇంకా పూర్తి సమాచారం కావాలని అనుకుంటే ఈమెయిల్ పాలీసెట్ ట్యాప్ కు పంపించాలని తెలిపింది.