జనసేన పార్టీకి పిఠాపురం మధురమైన జ్ఞాపకంగా మిగిలి పోయేలా చేసిందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం జయకేతనం సభకు వేదిక కావడం ఆనందంగా ఉందన్నారు. పార్టీని ఆశీర్వదించి అధికారంలో భాగస్వామ్యం చేసేలా చేసిన ఘనత ప్రజలకు దక్కిందన్నారు. వారికి జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని న భూతో అన్న రీతిలో నిర్వహిస్తున్నామని, దీనికి పార్టీలోని ప్రతి ఒక్కరూ మమేకం కావాలని పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఎవరూ ఊహించని రీతిలో సక్సెస్ చేయాలని కోరారు.