మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించిన చేసిన కామెంట్స్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచిత్రం ఏమిటంటే మాజీ ఎంపీ వ్యవసాయం చేసుకుంటానంటూ చిలుక పలుకులు పలుకుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆయన వ్యవహార శైలి నచ్చకనే జగన్ దూరం పెట్టారని అన్నారు. జగన్ ను టార్గెట్ చేస్తూ లోపాయికారిగా సీఎం చంద్రబాబు నాయుడుకు సాయం చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు కాకాణి గోవర్దన్ రెడ్డి. అందుకే తనంతకు తానుగా పార్టీ నుంచి వెళ్లి పోయాడని ధ్వజమెత్తారు.