జడ్జి ముందు పోసాని కంటతడి
NEWS Mar 13,2025 09:44 am
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , నారా లోకేష్, భువనేశ్వరిలపై నోరు పారేసుకున్నాడని ఆరోపిస్తూ ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఆయనను ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు తరలిస్తున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని కృష్ణ మురళి. తాజాగా గుంటూరు కోర్టులో విచారణ నిమిత్తం పోసాని కృష్ణ మురళిని పోలీసులు హాజరు పరిచారు. ఈ సందర్బంగా వాదోప వాదనలు కొనసాగాయి. ఎవరూ ఊహించని రీతిలో పోసాని జడ్జి ముందు కంట తడి పెట్టారు.