పాకిస్తాన్ ట్రైన్ హైజాక్ లో మిలిటెంట్లు ఖతం
NEWS Mar 13,2025 09:02 am
పాకిస్తాన్ ఆర్మీ జనరల్ కీలక ప్రకటన చేసింది. రైలు హైజాక్ ఘటనకు సంబంధించి 21 మంది ప్రయాణీకులతో పాటు నలుగురు పారా మిలటరీ సైనికులు మృతి చెందారని వెల్లడించింది. పాకిస్తాన్ భద్రతా బలగాలు జరిగిన కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందినట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా 8వ టన్నెల్ వద్ద రైలును ఆపేసి, ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు బలూచిస్తాన్ మిలిటెంట్స్ ఆర్మీ. దీనిపై నెలకొన్న ఉత్కంఠకు తెర దించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ ఆర్మీ.