గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
NEWS Mar 13,2025 08:53 am
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో గురువారం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పై చర్చ జరగనుంది. నిన్న గవర్నర్ ప్రసంగం పూర్తయింది. దీనిపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రగతి గురించి ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. పూర్తిగా గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ లాగా ఉందంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇక 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు.