బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి నోటీసులు
NEWS Mar 13,2025 08:43 am
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. కోడి పందెం కేసుకు సంబంధించి ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు మొయినాబాద్ పోలీసులు. గత నెలలో తోల్కట్ట లోని ఫామ్ హౌస్ లో భారీగా కోడి పందేలు నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. దాడులు చేయడంతో ఎమ్మెల్సీ వ్యవహారం బయటకు వచ్చింది. కోడి పందేలతో పాటు కేసినో కూడా ఆడినట్లు వెల్లడించారు.