విద్యార్థుల తగ్గుదల సీఎం రేవంత్ ఆరా
NEWS Mar 12,2025 05:17 pm
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రైవేట్ స్కూల్స్తో ఎందుకు ప్రభుత్వ బడులు పోటీ పడలేక పోతున్నాయంటూ ప్రశ్నించారు.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు చేరడం లేదని ఆరా తీశారు. రాష్ట్రంలోని అన్ని కలిపి 29, 550 స్కూల్స్ ఉన్నాయని, అన్నింటిలో కలిపి 25 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని అన్నారు.. రెసిడెన్షియల్ స్కూల్స్లో విద్యార్థులకు 40 వేలు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కృషి చేయాలన్నారు సీఎం.