గద్దర్ అవార్డుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
NEWS Mar 12,2025 05:03 pm
తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజా గాయకుడు దివంగత గద్దర్ పేరుపై అవార్డులను ఇస్తున్నామని, ఇందు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు తెలంగాణ చలన చిత్ర పరిశ్రమ అభివృద్ది సంస్థ చైర్మన్ దిల్ రాజు. కమిటీని కూడా సర్కార్ ఏర్పాటు చేసిందన్నారు. 2024కు సంబంధించి ఏప్రిల్లో అవార్డ్స్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. పైడి జయరాజ్, కాంతారావు పేరుతో కూడా అవార్డ్స్ ఇస్తామన్నారు.. తెలంగాణ నుంచి అవార్డ్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ సపోర్టు చేయాలని కోరారు దిల్ రాజు.