జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం
NEWS Mar 12,2025 04:42 pm
రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశంపై తమ ప్రభుత్వం పరిశీలన జరుపుతోందన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. సభ్యులు కొణతాల రామక్రిష్ణ, కాల్వ శ్రీనివాసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఏ మండలంలో రేషన్ కార్డు ఉంటే ఆ మండలంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలం ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. భూ సంబంధ అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై అధ్యయనం చేసి సిఫార్సు చేస్తుందన్నారు. జర్నలిస్టులను ప్రత్యేక వర్గంగా భావించి ఇళ్ల స్థలాలను తక్కువ రేటుకు ఇవ్వడం సరైంది కాదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు.