ఫైళ్ల దగ్దం వెనుక పెద్దిరెడ్డి హస్తం
NEWS Mar 12,2025 04:34 pm
మంత్రి వంగలపూడి అనిత షాకింగ్ కామెంట్స్ చేశారు. మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల హస్తం ఉందని ఆరోపించారు. సబ్ కలెక్టక్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి కీలక ఫైళ్లను దగ్ధం చేసిన కేసులో ఇప్పటికే ఆర్డీవో మురళీ, కొత్త ఆర్డీవో హరిప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్‌పై ప్రాథమిక విచారణ జరిపామన్నారు. అనంతరం సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ నేతృత్వంలో వేగంగా దర్యాప్తు జరుగుతుందన్నారు.