సీఐడీ విచారణకు విజయ సాయి రెడ్డి
NEWS Mar 12,2025 04:25 pm
మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి కాకినాడ పోర్టులో వాటాల బదిలీ కేసుకు సంబంధించి విజయవాడ సీఐడీ ఆఫీసులో విచారణకు హాజరయ్యారు. కేసులో ఏ1గా ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి కూడా ఉన్నారు. కాకినాడ పోర్టులో వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారంటూ ఇద్దరిపై కేసు నమోదైంది. ఈ సందర్బంగా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇదిలా ఉండగా విజయ సాయి రెడ్డి తప్ప మరెవరినీ పోలీసులు లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీనిపై తీవ్రంగా మండిపడ్డారు. పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.