కిషన్ రెడ్డిపై చామల గుస్సా
NEWS Mar 12,2025 02:33 pm
కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఏకి పారేశారు. ఆయన కేబినెట్ లో ఉన్నా లేకున్నా ఒక్కటేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కావాలని వివక్ష చూపిస్తున్నారంటూ ఆరోపించారు. లక్షా 50 వేల కోట్లు అడిగితే తనకు నవ్వు ఎలా వస్తోందో తెలియడం లేదన్నారు. నిధులు అడగడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తమ రాష్ట్రం నుంచి జీఎస్టీ కేంద్రానికి కట్టడం లేదా అని నిలదీశారు. రాష్ట్రానికి సాయం చేయాల్సింది పోయి కిషన్ రెడ్డి వెటకారం చేయడం మంచి పద్దతి కాదన్నారు చామల.