తెలంగాణను దగా చేసిన కేసీఆర్
NEWS Mar 12,2025 11:12 am
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అన్ని రకాల వైఫల్యాలకు కారణం కేసీఆరేనంటూ ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని హామీ ఇచ్చారని, దానిని గాలికి వదిలి వేశారని అన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం చట్టం తీసుకు రావాలన్న ఆలోచన చేయక పోవడం దారుణమన్నారు. ప్రతిపక్షమే కాదు ప్రతిపక్ష నాయకుడిగా పూర్తిగా ఫెయిల్ అయ్యారంటూ పేర్కొన్నారు అద్దంకి దయాకర్. కేసీఆర్ ను ప్రజలు పట్టించు కోవడం మానేశారని అన్నారు.